TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొల్లేరును గుల్లచేశారు ... గుక్కెడు నీళ్ళుకూడా లేకుండా చేశారు ..

Published on: Wed May 2, 2012 9:59AM

కృష్ణా, పశ్చినగోదావరి జిల్లాల మధ్యన సుమారు 70వేల ఎకలార విస్తీర్ణంలో సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేటి సరస్సును కాసులకోసం కక్కుర్తిపడి కొందరు బడా నాయకులు, వ్యాపార వేత్తలు కొల్లగొట్టేశారు. ప్రస్తుతం కొల్లేరు తన స్వరూపాన్ని పూర్తి గా పోగొట్టుకుంది. స్వచ్చమైన నీరు వుండాల్సిన కొల్లేరులో ఇప్పుడు ఎక్కడ చూసినా మురికినీరే దర్శనమిస్తోంది. సుమారు 55వేల ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. ఈ ప్రాంత వాసులకు మంచినీళ్ళు కూడా కరువయ్యాయి.

 

వీరు ప్రైవేట్ సంస్థలు విక్రయించే నీతిపైనా లేదా స్వచ్చంద సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ లు సరఫరా చేసే నీటిపైనే పూర్తిగా ఆధారపడ్డారు. గత 30 సంవత్సరాలుగా కృష్ణజిల్లా, పశ్చ్నిమగోదావారి జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇక్కడ విచ్చలవిడిగా చేపల చెరువులు తవ్వి కోట్లాది రూపాయలు ఆర్జించారు. కొల్లేరును మాత్రం గుల్ల చేశారు. కొల్లేరులో చేపల చెరువులు వేసి కోట్లాది రూపాయలు ఆర్హించిన వ్యక్తులందరూ టం పెట్టుబడులను మాత్రం బయట ప్రాంతాల్లో పెట్టారు. కొల్లేరుప్రాంత అభివృద్ధికి వారు చేసిందేమీ లేదు.

 

 

 

ఒకానొక దశలో కొల్లేరుకు సమీపాన ఒక ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించి ఇక్కడ లభ్యమయ్యే చేపలను నేరుగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలని స్థానిక వ్యాపారులు ఆశించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐటిశాఖ అధికారులు ఈ వ్యాపారులపై దాడులు జరపడంతో వారు ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదనను అటకెక్కించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ చేపల చెరువుల్లో కొన్నింటిని ధ్వంసం చేసినప్పటికీ కొల్లేరు మాత్రం తన పూర్వ వైభవాన్ని సంతరించుకాలేకపోయింది. కొల్లేరు సరస్సు ఎగువ భాగం నుంచి వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరేది. ఎర్రకాలువ, రామిలేరు. తమ్మిలేరు వంటి వాగులతో పాటు మిగతా చోటినుంచి కూడా నేరుగా నీరు కొల్లేరుకు చేరడంతో సరస్సు కళకళలాడేది. అయితే స్వార్థపరులు ఈ సరస్సు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వి సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సును నామరూపాలు లేకుండా చేశారు.