TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూపల్లికి ఝలక్ ఇచ్చిన తెలంగాణా ఉద్యోగులు

Published on: Fri Mar 9, 2012 11:59AM

కొల్లాపూర్: కొల్లాపూర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు క్రమంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని రేషన్ షాపు డీలర్లను వేధించారు. దీంతో రేషన్ డీలర్ల అసోసియేషన్ ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పుడు తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కొన్ని విభాగాలు ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో తమ మద్దతు జూపల్లి కృష్ణారావుకు ఉండదని ప్రకటించాయి. దీంతో జూపల్లి కృష్ణారావు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయింది. ఉద్యోగ సంఘాల్లోని అత్యధికులు జూపల్లికి మద్దతు పలుకుతున్నప్పటికీ కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. నిజానికి తాము జూపల్లికి వ్యతిరేకంకాదని, కేసీఆర్ పై ఉన్న ద్వేషంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. సకలజనుల సమ్మెలో భాగంగా జెఎసి ఛైర్మన్ రాజేందర్ రెడ్డితో సహా 34 మంది అరెస్టయి జైలుకు వెళ్ళిన సమయంలో కేసీఆర్ తమను పరామర్శించిన పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ వైఖరి ఇప్పుడు జూపల్లి కృష్ణారావుకు శాపంగా మారే పరిస్థితి ఏర్పడింది.