TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొల్లాం ప్రమాదం విద్రోహ చర్యా..?

Published on: Mon Apr 11, 2016 5:00PM

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పరవూర్ పుట్టింగల్ ఆలయంలో బాణాసంచా పేలి 110 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పుడు ప్రజల్లోనూ..ప్రభుత్వంలోనూ అనేక కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. కాళికాదేవి ఆలయంలోకి అతి సమీపంలో మూడు గుర్తుతెలియన కార్లు పార్క్ చేసి ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు  తనిఖీలు నిర్వహించగా వాటి నిండా భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నాయి. దీంతో కొల్లాంలో మళ్లీ కలకలం రేగింది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? నిన్న పేలుళ్ల వెనుక సంఘవిద్రోహ శక్తుల హస్తం ఉందా అని ప్రజలు, పోలీసులు చర్చించుకుంటున్నారు.  

 

బాణాసంచా పేలుళ్లతో అంత ప్రమాదం జరగే అవకాశమే లేదని పలువురు అనుమానిస్తున్న నేఫథ్యంలో  తాజా ఘటన దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. నిన్న ప్రధాని నరేంద్రమోడీ సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయా? లేక ఆ తరువాత తీసుకొచ్చి పార్క్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్‌ఐఎస్, జైషే మహ్మద్, లష్కరేతోయిబా వంటి కొన్ని తీవ్రవాద సంస్థలు గత కొంతకాలంగా దేశంలో అలజడులు సృష్టించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే మన భద్రతాదళాలు వాటి ఆటలు సాగనివ్వడం లేదు. దీంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఉగ్రవాదులు పుట్టింగల్ ఆలయాన్ని ఏమైనా టార్గెట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఏది ఏమైనా 110 మంది అమాయకులు ఈ ప్రమాదంలో బలి పశువులయ్యారు.