కోల్ కతాలో అగ్ని ప్రమాదం.. తొమ్మండుగురు సజీవదహనం.!
Published on: Wed Aug 19, 2026 9:35AM
కోల్‌కతాలో బుధవారం (ఆగస్టు 19) తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తొమ్మండుగురు మృత్యువాత పడ్డారు. కోల్ కతాలో అత్యంత రద్దీగా ఉండే మిర్జా గాలిబ్ స్ట్రీట్ లో బుధవారం (ఆగస్టు 19) తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో ఒ భవనంలో చెలరేగిన మంటలు క్షణాల్లోని వ్యాపించాయి.
ఘటన జరిగిన సమయంలో భవనంలో ఉన్నవారు గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన తొమ్మిది మందూ బంగ్లాదేశ్ పౌరులేనని గుర్తించారు. మృతులంతా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నవారే. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది . గాయపడిన వారిని ఆ స్పత్రికి తరలించారు.
Kolkata Fire Accident, Mirza Ghalib Street Fire, Bangladeshis Burnt Alive, Kolkata News, West Bengal Fire Tragedy, Fire Accident Today


