ఏడాది పాటు ఎమ్మెల్యేగా కొలికిపూడి జీతం సీఎం సహాయనిధికి!
Published on: Thu Jun 13, 2024 9:20AM
కొలికిపూడి శ్రీనివాస్.. అమరావతి ఉద్యమం గురించి తెలిసిన వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ పాలనను ఎండగట్టడంలో ఆయన గత ఐదేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమించారు. అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు.
ఆయన పోరాట పటిమను గుర్తించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కొలికిపూడికి తిరువూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని ఒక ఏడాది పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


