ఛా౦పియన్స్ ట్రోఫీలో సెంచరీలతో భారత్ బోణీ

 

 

 Kohli, Karthik centuries India beat Sri Lanka, Kohli, Karthik centuries, India beat Sri Lanka

 

 

టీమిండియా యువ సంచలనం విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 144, దినేష్ కార్తీక్ 81 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 నాటౌట్, సూపర్ సెంచరీలతో చెలరేగడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా శ్రీలంకతో జరిగిన వామప్ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా బ్యాటింగ్‌లో రాణించిన ధోనీసేన ఐదు వికెట్లతో నెగ్గింది. లంక నిర్దేశించిన 334 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో 20.3 ఓవర్లలో 110 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో శతక వీరులు కోహ్లీ, కార్తీక్ ఐదో వికెట్‌కు 186 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివర్లో కోహ్లీ అవుటైనా కార్తీక్, ధోనీ 18 మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.

 

సురేష్ రైనా 34 పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో షమింద ఎరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లకు 333 పరుగులు సాధించింది. ఓపెనర్లు కుశాల్ పెరెర 82 రిటైర్డ్ హర్ట, దిల్షాన్ 84 రిటైర్డ్ హర్ట్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం మహేల 30, సంగక్కర 45, చాందిమల్ 46 రాణించడంతో లంక స్కోరు మూడొందలు దాటింది. భారత బౌలర్లలో ఇషాంత్, భువనేశ్వర్, అమిత్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.