నాగపూర్ టెస్ట్: పోరాడుతున్న ధోని, కోహ్లి
Published on: Sat Dec 15, 2012 1:35PM

నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్ కోహ్లి, ధోని పోరాడుతున్నారు. నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా ఆడుతుంది. కోహ్లి, ధోని ఒత్తిడిలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసి పోరాట ప్రతిభను కనబరుస్తున్నారు. కోహ్లి 234 బంతుల్లో 77 పరుగులు చేయగా, ధోని 186 బంతుల్లో 75 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 227/4 పరుగులు చేసింది.


