చంద్రబాబుకి తలనొప్పిగా.. అప్పుడు వాళ్లిద్దరు.. ఇప్పుడు వీళ్లు
Published on: Thu Jan 7, 2016 1:48PM

ఈమధ్య టీడీపీ పార్టీల్లో నేతల మధ్య బేధాభిప్రాయాలు ఎక్కువయ్యాయి. మొన్నటి వరకూ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ల మధ్య వివాదాలు అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు కొత్తగా స్పీకర్, యనమల వంతు మొదలైంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఇద్దరి మధ్య గొడవ ఏంటంటే.. అసంబ్లీ సమావేశాల గురించి. స్పీకర్ కోడెల నవ్యాంధ్రలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు.. మొన్న జరిగిన శీతాకాల సమావేశాలు కూడా నవ్యాంధ్రలోనే జరగాలని అనుకున్నారు.. కానీ అది కుదరలేదు. అదే సమయంలో సమయంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ అనుకున్నారు. అయితే చంద్రబాబు అక్కడ సమావేశాలు పెడితే విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలుగుతుందని..అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని భావించిన చంద్రబాబు ఇందుకు సుముఖత తెలపలేదు.
ఇక ఇదే అసెంబ్లీ విషయంలో యనమల బడ్జెట్ సమావేశాలు వైజాగ్ లో జరపాలని భావిస్తున్నట్టు ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి. దీంతో స్పీకర్ యనమల తనతో సంప్రదించకుండా ప్రకటన చేశారని నొచ్చుకున్నారంట. దీంతో ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య చిన్న గ్యాప్ వచ్చిందట. ఏదో చిన్న నేతలైతే సర్ది చెప్పొచ్చుకాని.. ఇద్దరు సీనియర్ నేతలను చెప్పాలంటే కొంచెం కష్టమైన పనే. మరి వారిమధ్య విబేధాలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి.
ఇదిలా ఉండగా ఏపీలో సమావేశాలు జరగాలని స్పీకర్ కోరిన మేరకు చంద్రబాబు కూడా దానికి సముఖత తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఖర్చు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోవాలని కూడా సూచించారట. దీంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23నుంచి మంగళగిరి సమీపంలో ఉన్న హాయ్‌లాండ్‌లో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.


