కోదండరాం ఒంటరి పోరు

 

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేసారు.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంతసేపూ ఏ భవనం కూల్చాలి, ఏ స్థలం కబ్జా చేసుకోవాలన్న ఆలోచనే తప్ప అభివృద్ది గురించి ఆలోచించడం లేదని అన్నారు.. ముఖ్యమంత్రి కరీంనగర్‌లో నాటిన మొక్కను కాపాడుకోవడానికి పోలీసు పహారా, నీటి కోసం ప్రత్యేకంగా ఓ నీటి ట్యాంకు ఏర్పాటు చేశారని.. మరోవైపు రైతులు తమ పొలాలను కాపాడుకోవడానికి ఆందోళనలు చేస్తుంటే కేసులు పెడుతున్నారని విమర్శించారు.. తెలంగాణ సాధించడానికి అసువులు బాసిన అమరవీరుల స్తూపంతో పాటు, అంబేడ్కర్ స్తూపం నిర్మించడానికి ప్రభుత్వం ఆసక్తి కనబర్చడం లేదని.. దీనికి నిరసనగా హైదరాబాద్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కోదండరామ్‌ వెల్లడించారు.. అదేవిధంగా ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేసినా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసారు.