కోదండరాం అరెస్ట్.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..


టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొన్న  ప్రొ.కోదండరామ్‌ను.. ఆయనతోపాటు పలువురు నాయకులను.. పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ వద్ద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆయనను  బిక్కనూరు పోలీస్‌స్టేషన్ క తరిలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోదండ‌రామ్ అరెస్టును ఖండిస్తూ ప‌లు ప్రాంతాల నుంచి టీజేఏసీ కార్య‌క‌ర్త‌లు భారీగా ఆ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. కాగా త‌మ యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌ని కోదండ‌రామ్ పోలీసుల‌ను కోరగా, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. తాము యాత్ర చేసుకునేందుకు అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ పోలీసులు అడ్డుకోవ‌డం ఏంట‌ని కోదండ‌రామ్ మండిప‌డ్డారు.