250 కోట్లతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తా: కొడాలినాని
Published on: Sun Jul 22, 2012 5:14PM
ఇటీవల నానిని టిడిపి బహిష్కరించిన విషయం తెలిసిందే. బహిష్కరణకు గురైన అనంతరం ఆయన బహిరంగంగా తన నిర్ణయాన్ని చెప్పారు. కాగా నేడు వచ్చే సాధారణ ఎన్నికలలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు తాను రూ.250 కోట్లతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పుట్టిన ప్రదేశం రుణం తీర్చుకోవడానికి తల్లి వంటి తెలుగుదేశం పార్టీని వీడినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. కొడాలి నాని బహిరంగంగా తాను జగన్ పార్టీ నుండి పోటీ చేస్తానని ఇప్పటి వరకు చెప్పలేదు. ఆదివారం బహిరంగ౦గా ప్రకటన చేశారు.


