TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశువుల పాకలో కొడాలి!.. మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో ఫుల్ ఖాళీ!

Published on: Mon Apr 18, 2022 12:52PM

ఈ ఫోటో చూడండి.. కొడాలి నాని ఏం చేస్తున్నాడో గ‌మ‌నించండి.. ఆవుల కొట్టంలో.. ఓ మంచమేసుకొని.. రెండు దిండ్లు ప‌రుచుకుని.. హాయిగా రిలాక్స్ అవుతున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ ప‌శువుల కొట్టంలో ప‌ని చేసి..చేసి అల‌సిపోయిన‌ట్టున్నారు.. కాసేపు ఇలా సేద‌తీరుతున్న‌ట్టు ఉందీ ఫోటో..అంటున్నారు. 

పాపం.. కొడాలి నాని. మంత్రి ప‌ద‌వి పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న‌ట్టున్నారు. జ‌గ‌న‌న్న కోసం అంత చేస్తే.. త‌న ప‌ద‌వే పీకేస్తాడా అంటూ తెగ ఫైర్ మీదున్నార‌ట కొడాలి. ఇక‌పై ప్రెస్‌మీట్లు ఉండ‌వ‌నే బాధో.. బూతులు మాట్లాడే ఛాన్స్ రాద‌నే ఆక్రోష‌మో.. కార‌ణం ఏమో తెలీదు కానీ.. ఆయ‌న తీవ్ర అసంతృప్తితో, ఆవేద‌న‌తో ఉన్నార‌ని నాని అనుచ‌రులు చెబుతున్నారు. అందుకే, గుడివాడ‌ను వీడి రావ‌ట్లేదని అంటున్నారు. ఎమ్మెల్యేగా కొడాలి చేసే ప్ర‌జా సేవ ఏమీ ఉండ‌దు. మంత్రిగానూ పెద్ద‌గా ఏం చేసేవారు కాద‌నుకోండి.. క‌నీసం ఆ మీడియా స‌మావేశాల‌కైనా ప‌నికొచ్చే వారు. ఇప్పుడు జ‌గ‌న‌న్న ఆయ‌న పోస్టును ఫ‌స‌క్ అనిపించ‌డంతో.. ఇక చేసేది లేక‌, ప‌నేమీ లేక‌.. ఇలా ప‌శువుల కొట్టానికి మ‌కాం మార్చేసిన‌ట్టున్నారు. వైట్ ష‌ర్ట్ వేసుకొని.. ఆవులు, గేదెలు, పేడ కుప్ప‌ల మ‌ధ్య‌.. మంచంపై న‌డుం వాల్చి.. మంత్రిగా మూడేళ్ల తీపి జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారేమో అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తుంటే. 

లేటెస్ట్‌గా ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ పిక్‌కు నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ప‌ద‌వి పోవ‌డంతో మాజీ మంత్రి గారు బ‌ర్రెలు కాసుకుంటున్న‌ట్టుందంటూ సెటైర్లే వేస్తున్నారు. జ‌గ‌న‌న్న దెబ్బ కొడితే.. పోయి ప‌శువుల కొట్టంలో ప‌డ్డ‌ట్టున్నారంటూ కొంద‌రు.. గ‌తంలో మీరు లారీ డ్రైవ‌రో, క్లీన‌రో క‌దా.. పార్ట్ టైమ్‌గా ఆ ప‌ని కూడా చేసుకుంటే బెట‌ర్ అని ఇంకొంద‌రు.. ప‌శువుల బాష మాట్లాడే మీకు ఆ లోకేష‌న్ బాగా స‌రిపోతుంది, ఇక అక్క‌డే ప‌ర్మినెంట్‌గా ఫిక్స్ అయిపోండంటూ.. ఇలా ర‌క‌ర‌కాలుగా కాక రేపే కామెంట్లతో కుమ్మేస్తున్నారు నెటిజ‌న్లు.  

మ‌రోవైపు.. కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని అంటున్నారు. అందుకే మునుపటి జోరు ఆయ‌న‌లో అస‌లే మాత్రం కనిపించడం లేదు. కేబినెట్ ర్యాంకుతో సమానమైన మరో పదవిని ఇస్తానంటూ సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చినా నాని మాత్రం సంతృప్తిగా లేరంటున్నారు. మంత్రి ప‌ద‌వి మంత్రి ప‌ద‌వే అని.. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టు ఇచ్చినా ఆయ‌న కూల్ అయ్యేలా లేరంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయ‌న‌ ముఖంలో ఆనంద‌మ‌నేదే లేకుండా పోయింది. మంత్రి ప‌ద‌వి పోయిన‌ప్ప‌టి నుంచీ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంట్లో ఏ ప‌ని లేకుండా ఖాళీగా ఉండ‌లేక‌.. ఇలా ప‌శువుల పాక‌లో టైంపాస్ చేస్తూ.. రిలాక్స్ అవుతూ.. ఏదో అలా కాలం గ‌డిపేస్తున్నారేమో అనుకుంటున్నారు ఈ ఫోటో చూసిన వాళ్లంతా.