TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని

Published on: Sat Jul 5, 2025 6:47PM

మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్‌‌లో  హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు. అయితే అనేక మంది వైసీపీ నేతలతో కొడాలి నాని పోలీస్‌స్టేషన్‌కు రావడం వివాదస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు. 

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆయన గుడివాడ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయంలో నాని పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు రాచమర్యాదలు చేసేవారు. అప్పుడు అధికార ధీమాతో పోలీసులను బెదిరించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఓడలు, బండ్లు  అవుతాయి బండ్లు  ఓడలు అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు