TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కామెడీ బ్రదర్స్ కొడాలి, వల్లభనేని!

Published on: Thu Jun 9, 2022 2:14PM

ఓరాత్రివేళ  దొంగ‌లు ప‌డ‌డం గురించి విన్నాం. దొంగ‌త‌నంగా వ‌చ్చి అన్ని వినివేళ్లే వేగుల గురించి విన్నాం. కానీ దొంగ‌పేర్ల‌తో  ఒక  కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌వారిని  ఏమ‌నాలి?   వీళ్లేమీ సాధిద్దామ‌నుకున్నారో వారిని పంపిన వారికే తెలియాలి. గూఢ‌చారుల్లా  వెళ్లిన‌వారు ఏదోటి సాధించుకురావాలి. కానీ  ఈ స‌రికొత్త గూఢ‌చారులు తిట్లు తిని వెన‌క్కి వ‌చ్చారు!

ఇదంతా జ‌రిగింది ఒక జూమ్ స‌మావేశంలోనే!వెండి తెరపైన.. బుల్లి తెరపైన మాత్రమే ఇప్పటి వరకు కమెడియన్స్ ను చూశాం. కానీ కొందరు రాజకీయ కమేడియన్లు జూమ్ మీటింగ్‌లో కూడా క  ఎంట్రీ ఇస్తున్నారు. అదీ తప్పుడు ఐడీలతో, మారుపేర్లతో   దీంతో ఆ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన వారే కాదు... ఈ మీటింగ్‌కు హాజరైన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తర్ణత శాతం 67కి పడిపోయింది. గతంలో ఉత్తీర్ణత 90 నుంచి 95 శాతం ఉండేది.  నేడు ఆ  ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లీదండ్రులే కాదు.. ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్.. రంగంలోకి దిగి.. 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గురువారం జూమ్ మీటింగ్  నిర్వహించారు. ఈ మీటింగ్ జరుగుతోండగా.. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు.. కూడా మారు పేర్లతో  విద్యార్థుల ఐడీలతో ఈ జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు.  దీంతో ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లీదండ్రులే కాదు.. ఈ మీటింగ్‌ను వీక్షిస్తున్న వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు.  అయితే ఈ మీటింగ్‌కు వీరిద్దరూ హాజరైనా.. నారా లోకేశ్ మాత్రం ఎక్కడా.. కట్టు తప్పకుండా.. మీకు దమ్ముంటే.. నేరుగా రండి... నేరుగా మాట్లాడండంటూ వారికి సవాల్ విసిరారు. అంతేకాదు.. వాళ్ల ప్రభుత్వం చేస్తున్న.. తప్పులు.. వాళ్లు కూడా తెలుసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.   

అయితే ఈ మీటింగ్ హాజరైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ముసిముసి నవ్వులు నవ్వడం పట్ల.. సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. వీరిద్దరివీ పిల్ల చేష్టలు అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. సరిపోయింది కామెడీ బ్రదర్స్ వచ్చేశాంటూ మరోకరు ఛలోక్తి విసిరారు. ఇంకొకరు అయితే.. ఒకరు బూతుల మంత్రి, మరొకరు వెకిలి ఎమ్మెల్యే అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాదు.. ముందు తప్పుడు మాటలు మాట్లాడడం... ఆ తర్వాత డ్యామేజ్ జరిగిపోయిందంటూ.. నాలుక కరుచుకొని.. బుల్లి తెరపై చర్చ కార్యక్రమాల్లో లైవ్‌లోకి వచ్చి... క్షమించు అక్కా.. తప్పు అయింది అక్కా.. అంటూ కాళ్లా వేళ్లా పడి క్షమాపణలు కొరతాడంటూ మరో నెటిజన్ సెటైర్లు వేశారు.  ఇంకొకరు అయితే వల్లభనేని వంశీవి వట్టి పిల్ల చేష్టలు అని.. ఒక కొడాలి నానివి కితకితల మంత్రి అని.. వీళ్లిద్దరి సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనంటూ  కామెంట్ పెట్టారు. 

అయితే వీరిద్దరు బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి.. వాళ్లను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి.... ప్రతిపక్ష పార్టీ జూమ్ కార్యక్రమంలో మారు పేర్లతో జాయిన్ అయ్యారంటే.…. వీళ్లనేమనాలంటూ నెటిజన్లు.. డాష్.. డాష్.. డాష్.. అంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం. కొడాలి నాని కూడా 10వ తరగతే చదివాడు. కానీ ఆ రోజుల్లో పదవ తరగతి తప్పాడని... అందుకే ఈ జూమ్ కార్యక్రమానికి హాజరయ్యారేమోనని.. మరో నెటిజన్ సెటైరికల్‌ కామెంట్ నెట్టింట  విసిరాడు. 

అయినా వీళ్లిద్దరికీ సిగ్గు, శరం, వగైరా వగైరా ఏమీ లేవంటూ ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న పదో తరగతి విద్యార్థులు సైతం కామెంట్ చేయడం గమనార్హం. వీళ్లిద్దరు పక్కా కామెడీ బ్రదర్స్‌లాగా ఉన్నారని.. వీళ్లకు కొంచెం జ్జానం ప్రసాదించు తల్లి.. అంటూ ఆ చదువులు తల్లి సరస్వతిని ఈ విద్యార్థులు వేడుకొవడం...ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  ట్రెండ్ అవుతోంది.