TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీకీ షాకిచ్చిన కోల్‌కతా

Published on: Tue May 8, 2012 8:55AM

ఇన్నాళ్లూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీకి కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీని కూడా అలవోకగా ఓడించిన నైట్‌రైడర్స్ ఐపీఎల్-5 లో వరుసగా ఆరో విజయం సాధించింది. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే నెగ్గింది. ఓపెనర్లు మెకల్లమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు), గంభీర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. గంభీర్ జోరుతో కోల్‌కతా పవర్‌ప్లే ఆరు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సాధించడం విశేషం. గంభీర్ అవుటయ్యాక... కలిస్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెకల్లమ్‌కు అండగా నిలబడ్డాడు.

 

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్), వార్నర్ (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఆరంభాన్నిచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. జయవర్ధనే (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు.