TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడివి శేష్ 'కిస్' మూవీకి సూపర్ రెస్పాన్స్

Published on: Fri Sep 13, 2013 5:25PM

 

kiss telugu movie talk, kiss telugu movie review, kiss telugu movie release, adivi sesh kiss

 

 

పంజా సినిమాలో నెగిటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్....'కిస్' మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తానే హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు, రచయిత కూడా శేషే కావడం విశేషం. అడివి శేష్ స్క్రీన్ ప్రేజన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. నటుడుగా మాత్రం ఈ సినిమాలో మంచి మార్కులే వేయించుకున్నాడు.

 

ఈ చిత్రానికి హైలైట్ మాత్రం ప్రియా బెనర్జీ. ఆమె అందచందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో ఆమె చాలా బాగా చేసింది. భరత్ రెడ్డి నెగిటివ్ రోల్ లో ఓకే అనిపించాడు. షఫీ కామెడీ బాగుంది.



అమెరికాలోని (శాన్‌ ఫ్రాన్సిస్కో) లో చిత్రీకరించిన విజువల్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా కోసం ఖర్చుకు వెనుకడానందుకు నిర్మాత సాయి కిరణ్ అడివిని ప్రశంసించాలి. సంగీతం, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫైనల్ గా అడవి శేషు తనను తాను మాస్ హీరోగా చూపించేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి.