24 గంటల 'కిస్'
Published on: Wed Sep 4, 2013 12:40PM
.jpg)
అడివి శేష్ హీరోగా నటించిన 'కిస్' మూవీ ఈ నెల13న విడుదలకు సిద్దమవుతుంది. 'కిస్' ఆడియో కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఒక అమ్మాయి..అబ్బాయి మధ్య 24 గంటల్లో జరిగిన జర్నీని సింపుల్ రొమాంటిక్ స్టోరీ గా తెరకెక్కించమని అడివి శేష్ అన్నారు.
ఓ మాస్ అబ్బాయి...ఓ క్లాస్ అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. కామన్‌మేన్‌కి ఈజీగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని శేష్ చెప్పారు. సాయి కిరణ్ అడవి నిర్మించిన ఈ సినిమాకి సాయిచరణ్ పాకల – పీట్ వండర్ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాతో మరో హాట్ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. 'మిస్ కెనడా ఫోటోజెనిక్'గా పేరుబడిన ప్రియా బెనర్జీ నీ 'కిస్' తో టాలీవుడ్ పరిచయం చేస్తున్నాడు శేష్. ఆన్ స్క్రీన్ పై ప్రియా, శేష్ ల కెమిస్ట్రీ హాట్ గా ఉందని వార్తలు కూడా వచ్చాయి. 'కిస్' తో ప్రియా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకోవడం ఖాయమని అంటున్నారు.


