కిరణ్ బేడీ నిర్ణయంపై మండిపడుతున్న నెటిజన్లు...
Published on: Sat Apr 28, 2018 4:13PM

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కిరణ్ బేడీ తీసుకున్న నిర్ణయం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. బహిరంగ విసర్జన రహిత, స్వచ్ఛ గ్రామాలుగా నిరూపించుకోలేని గ్రామాలకు ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. బహిరంగ విసర్జన జరగడం లేదనీ.. పూర్తి స్వచ్ఛత పాటిస్తున్నారని స్థానిక అధికార యంత్రాంగం సర్టిఫికెట్ ఇచ్చిన గ్రామాలకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఆమె ట్విటర్లో వెల్లడించారు. దీనికి ఆమె గడువు కూడా ఇచ్చారు. మే 31 వరకు నాలుగు వారాల గడువు ఇచ్చారు. దీంతో ఇప్పుడు కిరణ్ బేడి తీసుకున్న నిర్ణయంపై కామెంట్లు విసురుతున్నారు. ఇది చాలా కష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. ‘‘ఈ రెండిటికీ ముడిపెట్టడం తెలివైన పనికాదు. పరిశుభ్రత, ఆకలి రెండూ ఒకే ఒరలో ఇమడడం కష్టం..’’ అని కొంతమంది... ‘‘బియ్యం కొనుక్కోలేని వాళ్లు టాయిలెట్ కట్టుకోగలరా? అసలు ఇందులో లాజిక్ ఏమైనా ఉందా..?’’ అంటూ మరొకరు అంటున్నారు.


