అసెంబ్లీలో కిరణ్ కొత్త పార్టీపై చర్చలు..!

 

 

 

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీపై అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు చర్చలు జరిపారు.మంత్రులు పార్థసారధి, డీకే అరుణ మధ్య ఈ అంశంపై మాట్లాడుతూ కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని, విభజన ఆగుతుందని అనిపిస్తోందని మంత్రి పార్థసారథి అనగా, విభజన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని, కిరణ్ కొత్త పార్టీ పెట్టరని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ దుకాణం మూసేస్తే...కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తానని మరో నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 23 వరకు సైలెంట్‌గా ఉండాలని కిరణ్ చెప్పారన్నారు. తాను ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆదాల తెలిపారు. కాంగ్రెస్ టికెట్ కోసం ముసలివాళ్లు పోటీలో ఉన్నారని, హైకమాండ్ ఒక్కో సీటుకు రూ.2 కోట్లు ఇస్తుందంటా అని ఆయన అన్నారు. ఏ పార్టీలో సీటు దక్కని వాళ్లే సీఎం పార్టీలో చేరతారని ఆదాల అన్నట్లు తెలుస్తోంది. కిరణ్ చివరి నిమిషంలో పార్టీ పెట్టి రికార్డు సృష్టించవచ్చని మరో మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.