కిరణ్ పార్టీ విధేయుడే
Published on: Thu Nov 28, 2013 6:22AM
.jpg)
తెలంగాణ విషయంలో కొద్ది రోజులుగా అధిష్టానాన్ని దిక్కరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సియం కిరణ్‌కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ అండగా నిలిచారు. కిరణ్ కేవలం తన అభిప్రాయం మాత్రమే చెపుతున్నారని, ఆయన పార్టీని కానీ, సీడబ్ల్యూసి నిర్ణయాన్ని కానీ వ్యతిరేఖించటం లేదన్నారు.
విభజనకు సంబందించిన జీవోయం కసరత్తు దాదాపుగా పూర్తయిందని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ బిల్లు అసెంబ్లకి వస్తుందన్నారు.


