కిరణ్‌కు డిగ్గీ పిలుపు

 

కేంద్రంలో తెలంగాణ వేడి పెరుగుతున్న నేపథ్యంలో సియం కిరణ్‌కుమార్‌ రెడ్డి కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ అంశంపై గత కొంత కాలంగా ప్రరోక్షంగా మాటల యుద్దం చేస్తున్న కిరణ్‌ కుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు రేపు ముఖాముఖి కలవనున్నారు.

 

తెలంగాణ ఏర్పాటు సంభందించిన బిల్లు అసెంబ్లీకి రాదని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేంద్ర హొం మంత్రి సుశీల్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి దిగ్విజయ్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి స్పష్టత కోరారు.

 

ఈ నేపధ్యంలో రేపు ముఖ్యమంత్రిని ఢిల్లీ రావాల్సిందిగా దిగ్విజయ్‌ కోరారు. మొదటి నుంచి అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, ఆ తర్వాత ముసాయిదా బిల్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెబుతూ వచ్చారు. అందుకు విరుద్ధంగా సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేయడంతో రాష్ట్రంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. దీంతో సియం డిల్లీ పర్యటనపై ఆసక్తి  నెలకొంది.