కిరణ్ కు రాయపాటికి అండ

 

kiran kumar reddy, rayapati samba siva rao, telangana, seemandhra, congress, seemandhra mps

 

 

రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన సీనియర్లను కాదని విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తెలంగాణలో వచ్చే సీట్లకన్నా ఎక్కువే వస్తాయని ఆయన తెలిపారు.

 

మమ్మల్ని రాజీనామా చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేస్తున్నారో అర్థం కావడంలేదని రాయపాటి అన్నారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.



పైరవీతోనే కిరణ్‌కు సీఎం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు. ఢిల్లీకి ఆలస్యంగా రావడం వల్లే నిన్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవలేకపోయానని రాయపాటి వెల్లడించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిన్న స్పీకర్ను కలిశారు. వీరితో రాయపాటి వెళ్లలేదు. దీంతో రాయపాటి వివరణ ఇచ్చారు.