అధిష్టానంపై సియం తిరుగుబాటు

 

తొలి నుంచి తనని తాను సమైక్యవాదిగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి అధిష్టానం మీద తిరుగుబాటు చేశారు. కిరణ్‌ వైఖరి గురించి దిగ్విజయ్‌సింగ్‌ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరి తాను సమైక్యవాదినే అని చెప్పారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదని మరోసారి తెలిపిన సియం, రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించలేరన్నారు.

రాష్ట్రం విడిపోతే జలయుద్దాలు తప్పవని, మ్యాప్‌ చూపించి మరీ వివరించారు. సమ్మె విరమించమని ఉద్యోగులను కోరడానికి ప్రెస్‌మీట్‌ పెట్టిన సియం తన ప్రసంగం అంతా అథిష్టానం తప్పులను ఎత్తి చూపించడానికి ప్రయత్నించారు. తనకు ప్రదవి కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సద్దమన్నారు.

దిగ్విజయ్‌సింగ్‌ తనను సమైక్యాంద్ర ముఖ్యమంత్రి అని అన్నప్పుడల్లా తనకు పట్టుదల ఇంకా పేరుగుతుందన్నసియం, ప్రజలా పార్టీనా అన్న ప్రశ్న తలెత్తితే ప్రజలవైపే ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు. నెహ్రూ, ఇందిర తీసుకున్న నిర్ణయాల కన్నా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం గొప్పదా అని సోనియా నాయకత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు.

పార్టీ నిర్ణయానికీ, ప్రభుత్వ నిర్ణయానికీ చాలా తేడా ఉంది. విభజనపై ఇప్పుడు కాంగ్రెస్‌ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దానివల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించి కేంద్రం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజల్లో ఉన్న ఆందోళనలు నివృత్తి చేయకుండా మేం అన్నీ చూసుకుంటాం అంటే అది రాజకీయ ప్రకటనే అవుతుంది. పరిష్కారాలపై కేంద్రం లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే ప్రకటన చేయాల్సింది.