టీ-నోట్ కి టైముంది: మొయిలీ

 

రాష్ట్ర విభజన అంశం రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ అంతూ పొంతూ లేని ఒక సస్పెన్స్ టీవీ సీరియల్లాగా సాగుతోంది. ఈ జాప్యంతో రాష్ట్రంలో పరిస్థితి నానాటికి జటిలమవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక దానిని మరింత నాన్చడం వలన మరిన్నికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఉభయ ప్రాంతల నేతలకు సర్దిచెప్పడానికి కాంగ్రెస్ అధిష్టానం చెపుతున్నమాటలు, పార్టీకి ఏవిధంగాను సహాయపడకపోగా, పార్టీపై రెండు ప్రాంతాల ప్రజలలో అపనమ్మకం కలుగజేస్తోంది.

 

సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు టీ-నోట్ పై వివరణ కోరేందుకు నిన్నఅంటోనీ కమిటీలో సభ్యుడయిన వీరప్పమొయిలీని కలిసినపుడు, ఆయన అంటోనీ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత, అందులో సీమాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొన్నతరువాతనే టీ-నోట్ సిద్దం చేసి కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ప్రవేశ పెట్టబడుతుందని వారికి తెలిపారు. సోనియా గాంధీ ఇరుప్రాంతలకు న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.

 

మొయిలీ హామీ చూస్తే ‘టీ-నోట్ ఇప్పుడప్పుడే క్యాబినెట్ ముందుకు రాబోదని’ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులతో చెప్పిన విషయాన్ని దృవీకరిస్తున్నట్లుగానే ఉంది