కిరణ్ దెబ్బకి యంపీలు, మంత్రులు అవుట్

 

కేంద్రమంత్రి పదవి దక్కగానే రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన కావూరి సాంభశివరావు, నేడు మళ్ళీ సమైక్య రాగం అందుకొన్నారు. ఆయనలో ఆ మార్పుకు కారణం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది. నేడు కావూరి రేపు చిరంజీవి, కృపా రాణీ, ఆ తరువాత పురందేశ్వరి ఈవిధంగా అందరూ కూడా తన వెనుక నడువక తప్పని పరిస్థితి ముఖ్యమంత్రి కల్పించారు. నిన్నటి వరకు రాజీనామాకు ససేమీరా అన్న మరో కేంద్రమంత్రి కిల్లి క్రుపారాణీ కూడా అవసరమయితే రాజీనామాకు సిద్దం అంటూ ప్రకటించడం ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ.

 

ఒకవేళ ముఖ్యమంత్రి గనుక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభాజన ప్రక్రియను అమలుచేయడానికి సిద్దపడి ఉంటే, నేడు కావూరి కూడా ఈవిధంగా సమైక్య రాగం తీసేవారు కారని ఖచ్చితంగా చెప్పవచ్చును. త్వరలోచిరంజీవి తదితరులు కూడా కావూరి బాట పట్టినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి వారందరూ సమైక్యాంధ్రపై అభిమానంతో కాక, కేవలం తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఇటువంటి ఆలోచనలు చేయడం విషాదకరం. ఆ విధంగా చూసినట్లయితే, వీరందరి కంటే అధిష్టానంపై దైర్యంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రే అత్యంత నిజాయితీ కలవాడని భావించవచ్చును. ఆయన కేంద్రానికి నిర్ద్వందంగా తన అభిప్రాయలను చెప్పడమే కాకుండా దైర్యంగా ప్రశ్నించారు కూడా. కానీ మిగిలిన నేతలకు మాత్రం ఆయన పాటి దైర్యం, నిజాయితీ లేకపోయినా, ఏ ఎండకు ఆ గొడుగుపట్టడంలో తమకు మరొకరు సాటి ఉండరని రుజువు చేసుకొంటున్నారు.

 

ఒకవేళ మంత్రులు, యంపీలు కిరణ్ కుమార్ రెడ్డి ని అనుసరించినట్లయితే, త్వరలో పార్లమెంటులో వోటింగ్ కు రానున్న ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందడం చాల కష్టం అవుతుంది.  ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాక్యలపై ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం చాల విచిత్రంగా ఉంది. ఆయనను ఆపదవిలో కొనసాగించాలా, వద్దా? ఏవిధంగా చేస్తే బాగుటుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు వోటింగ్ కు రాకమునుపే కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీకి పిలిపించుకొని మాట్లాడి పరిస్థితి సర్దుమనిగేలా ప్రయత్నం చేయవచ్చును.కానీ, కిరణ్ అందుకు అంగీకరించనట్లయితే, అప్పడు కేంద్రం ఏమి చేస్తుందనేది ఒక పెద్ద ప్రశ్.