పంతం నెగ్గించుకున్న సిఎం కిరణ్? డిజిపిగా దినేష్‌రెడ్డి
Published on: Mon Oct 1, 2012 8:57AM
.png)
డిజిపి నియామకంలో కులసమీకరణ పాటించిన సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తన పేరు నిలబెట్టుకున్నారు. కేంద్రట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిజిపిగా దినేష్‌రెడ్డికి మరోసారి పూర్తిబాధ్యతలను సిఎం అప్పగించనున్నారు. గతంలో దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని సీనియర్ ఐపిఎస్ అధికారి గౌతంకుమార్ క్యాట్ ద్వారా వెల్లడించిన తీర్పును సిఎం ముందు నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు. రాజకీయ నాయకులే స్వయంగా తనను అడ్డుకుంటున్నారని గ్రహించే గౌతం కుమార్ తనపై భవిష్యత్తులో ఒత్తిడి వస్తుందని ఉద్యోగానికి విఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. దీనిని వెంటనే ఆమోదించిన సిఎం ఆ తరువాత గౌతంకుమార్ తెరమరుగు అయ్యేంత వరకూ తన వంతు పాత్రను పోషిస్తూనే వచ్చారు. క్యాట్‌తో పాటు రాష్ట్రహైకోర్టు కూడా జోక్యం చేసుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిఎం కొంచెం వెనక్కి తగ్గినట్లు నటించారు. ఆ తరువాత పూర్తిస్థాయి అర్హతలున్న డిజిపిగా దినేష్‌రెడ్డి పేరు ఖాయమయ్యేందుకు తెర వెనుక నాటకాన్ని నడిపారు. సిఎం కోరుకున్నట్లుగానే పూర్తిస్థాయి బాధ్యతలతో డిజిపిగా దినేష్‌రెడ్డి కొనసాగేందుకు తాజా ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పంతం నెగ్గించుకున్న సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఖ్యాతి గడించారు. రాష్ట్రప్రభుత్వం యుపిఎస్సీకి పంపించిన మూడుపేర్లలో దినేష్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఇంకా రెండేళ్లు సర్వీసు ఉన్నందున దినేష్‌రెడ్డికి అవకాశం లభించిందని సమాచారం.


