ఎన్ని చేసినా తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయలేరు
Published on: Wed Feb 8, 2012 4:10PM
హైద
రాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ఎంతమంది తెలంగాణ నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్నా తెలంగాణ ప్రాంతానికి ఒరిగేది ఏమీ ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామా రావు బుధవారం విమర్శించారు. మంత్రులతో ఉద్యమాన్ని దెబ్బ తియాలని కిరణ్ భావిస్తున్నట్లుగా ఉన్నారని, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమం దెబ్బతీయలేరన్నారు. మంత్రివర్గ మార్పుల వల్ల ఎలాంటి లాభముండదమన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని తన సిఎం సీటు ఎప్పుడు పోతుందోనని కిరణ్ లో భయం ఉందని అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పార్టీలకు చెందిన నేతలు రాజకీయాలకతీతంగా విచారణను ఎదుర్కొనేందుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు.


