TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా నాయకుడు కిరణే..మాది టీం వర్క్:దామోదర

Published on: Tue Jan 24, 2012 1:44PM

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొట్టిపారేశారు. సీఎంతో విబేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. సిఎం కిరణ్ మా నేత అని, మాది టీం వర్క్ అన్నారు. మా నాయకుడు కిరణే అన్నారు.కాంగ్రెస్ పార్టీలో దళితులకు న్యాయం జరుగుతుందని దామోదర రాజనర్సింహ తెలిపారు.మీడియాలో వచ్చిన కథనాలకు తాను ఎలా జవాబుదారి అవుతానని అన్నారు.అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని డిప్యూటీ సీఎం ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ వల్లే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిందని దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. అవాస్తవాలు రాయకూడదని మీడియాకు హితవు పలికారు.

కాగా ఇటీవల దామోదర, కిరణ్ మధ్య విభేదాలున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి స్థానంపై కన్నేసి సైలెంట్‌గా తన పని చేసుకు పోతున్నారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెసులో కాపు, రెడ్డిల ప్రాధాన్యత క్రమంగా తగ్గిస్తూ, ఎస్సీ, బిసి నేతగా ఎదగాలని దామోదర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.