నీ ఊరికొస్తా...నీ వీధికొస్తా...నీ ఇంటి కొస్తా... కిరణ్ కుమార్

 

ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో మొదలయిన రెవెన్యు సదసులో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తానూ మెహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు 7సార్లు వచ్చానని, కానీ, ఇదే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న కేసీఆర్ మీ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడని ప్రజలను ప్రశ్నించారు. తానూ ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లాకు వస్తుంటే, కేసీఆర్ మాత్రం ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రమే జిల్లాకు వచ్చిపోతుంటాడని హేళన చేసారు. తానూ మహా మొండివాడినని, తానూ దేనికీ వెనుకాడే మనిషిని కానని అన్నారు. తన ప్రభుత్వానికి 5ఏళ్ళు పాలించమని ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు తానెవారికో భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు.

 

తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం పై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా చొరవతీసుకొని తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయన ప్రాతినిద్యం వహించే జిల్లా మెహబూబ్ నగర్ కే వెళ్లి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడం ద్వారా తానూ నిజంగానే తాటాకు చప్పులకి బెదిరేవాడిని కానని ఆయన స్పష్టం చేసినట్లయింది.