మోడీ తల్లి డ్యాన్స్ చూశారా..!

 

ఈ రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే సోషల్ మీడియా వల్ల ఏ న్యూస్ రియలో.. ఏది ఫేక్ న్యూసో తెలియడం కష్టమైపోయింది. అలాంటి న్యూసే ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న వీడియో.. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.. మోదీ తల్లి హీరాబెన్ మోదీ దీపావళి రోజున డ్యాన్ చేశారని తన ట్వీట్టర్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో కిరణ్ బేడీపై ఒకటే విమర్శలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఆ వీడియోలో ఓ బామ్మ.. డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె చూడటానికి అచ్చం మోదీ తల్లి హీరాబెన్‌లాగే ఉంది.  గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఆ బామ్మ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ ట్వీట్‌కు తక్కువ టైమ్‌లోనే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి గాను కిరణ్ బేడి.. 97 ఏళ్ల వయసులో మోదీ తల్లి డ్యాన్స్ చూశారా అని కిరణ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.  అయితే ఆ తర్వాతే కిరణ్ బేడీకి ఆ వీడియోలో నృత్యం చేస్తున్న వృద్ధురాలు నరేంద్ర మోదీ తల్లికాదని తెలిసింది. దీంతో కిరణ్ బేడీ తన తప్పును ఒప్పుకున్నారు. 'ప్రధాని తల్లి అనుకుని పొరపడ్డాను. అయితే ఆ తల్లికి, ఆ తల్లి ఉత్సాహానికి శాల్యూట్ చేస్తున్నారు. 96 వయస్సులో నేను కూడా ఆమెలాగే ఉండాలని ఆశిస్తున్నాను' అంటూ మరో ట్వీట్ చేశారు.