అర్థరాత్రి స్కూటర్ పై గవర్నర్..

 


ఇప్పటి రాజకీయ నేతలు ఎన్నికలప్పుడు ఓట్లు అడిగామా...ఓట్లు పడ్డాయా... గెలిచామా.. పదవి దక్కిందా.. అంతవరకూ మాత్రమే పట్టించుకుంటారు. ఇక ఒకసారి పదవి దక్కితే చాలు ఇక ఓట్లు వేసిన ప్రజలు గుర్తుండరు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలే గుర్తుండవు.. వారి దగ్గరకు వచ్చి.. వారి సమస్యలు తెలుసుకునే తీరిక వారికుందా. కానీ ఇక్కడ ఓ గవర్నర్ మాత్రం అర్థరాత్రి రోడ్డు మీదకు వచ్చి భద్రతా విషయాలపై పరిశీంచారు. ఇంతకీ ఎవరా గవర్నర్ అనుకుంటున్నారా..? ఇంకెవరూ.. పుదుచ్ఛేరి గవర్నర్.. కిరణ్ బేడి. కిరణ్ బేడి ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుదుచ్చేరిలో మహిళ భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు సాక్షాత్తూ ఆమె.. అర్ధరాత్రి వేళ ద్విచక్రవాహనంపై పర్యటించారు. ఎవరూ ఆమెను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి చున్నీ కప్పుకున్నారు. ఎటువంటి భద్రత లేకుండానే పర్యటించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్‌, 100కు ఫోన్‌ చేసి సహాయం తీసుకోవాల్సింది ఆమె కోరారు. మరి అందరూ కిరణ్ బేడీల ఉంటే బాగానే ఉంటుంది..