స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సోనియా!

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదింపబడటం ఒకవైపు సమైక్యవాదులకు ఆనందాన్ని కలిగిస్తునప్పటికీ, మరోవైపు ఇదంతా తమను మభ్యపెట్టడానికి జరుగుతున్న తతంగమన్న అనమానం కూడా కలుగుతోంది. సీఎం సమైక్య సింహంలా ఎంత గర్జించిన్నప్పటికీ ప్రజల్లో ఏదో ఒక మూల ఆయన మీద అపనమ్మకం బలంగా వుంటోంది. ఆ సమైక్య సింహం చివరికి తమనే మింగేస్తుందేమోనన్న భయం కూడా సమైక్యవాదుల్లో వుంది.

 

అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా సోనియాగాంధీ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో జరిగి వుంటుందన్న అభిప్రాయాలు సాధారణ ప్రజానీకంలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అత్యుత్సాహంతో తెలంగాణ ఇవ్వడానికి ముందడుగు వేసింది. అయితే తన అత్యుత్సాహానికి తగిన ప్రతిఫలం ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి లభించే అవకాశం కల్పించడం లేదు. తెలంగాణ క్రెడిట్ అంతా తన అకౌంట్లో వేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ముందు మాటిచ్చిన ప్రకారం టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేయవయ్యా మగడా అంటే, కేసీఆరేమో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీఆర్ఎస్ భాగస్వామిగా వుంటుందని పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.



తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో, తెలంగాణని సింగపూర్‌లాగా ఎలా మలుస్తుందో చెప్తున్నాడు. దాంతో కాంగ్రెస్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలంగాణని భుజానికెత్తుకున్న పాపానికి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌ని సీమాంధ్ర సింహంలా ప్రజల ముందు నిలిపి సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా జనం అనుమానిస్తున్నారు. తెలంగాణ ఇష్యూని మరింత సాగదీసి ప్రెసిడెంట్ ఒప్పుకోలేదనో, కొత్తబిల్లు తయారు చేయాలనో, టైమ్ లేదనో, మరో సాకో చెప్పి కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని భావిస్తున్నారు.


తెలంగాణ ఇష్యూని టూమచ్ కాంప్లికేటెడ్ చేయడం ద్వారా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఓట్లేస్తేనే ఈసారి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజల్ని, టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామంటూ కేసీఆర్ని దారిలోకి తేవడానికే సోనియా పొలిటికల్ గేమ్ ఆడుతోందని అనుకుంటున్నారు. ఈరకంగా తెలంగాణలో, కిరణ్‌ని సీమాంధ్ర సింహంలా ప్రొజెక్ట్ చేయడం ద్వారా సీమాంధ్రలో ఓట్లు, సీట్లు సంపాదించాలనేది కాంగ్రెస్ వ్యూహమని జనం భావిస్తున్నారు.