కిరణ్ కాంగ్రెస్ కు విశ్వాసపాత్రుడు
Published on: Tue Oct 22, 2013 4:26PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వెళ్తుందా లేదా ఇప్పుడే తాను చెప్పలేనని స్పష్టం చేశారు.రాజ్యాంగబద్దంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు వాస్తవాన్ని అర్ధం చేసుకొని, రాజీనామాలు ఉపసంహరించుకోవాలని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ చెప్పారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడంపై ఎవరితోను తాము చర్చించలేదన్నారు.


