ఉత్తర కొరియా సమస్య మళ్లీ మొదటికి

 

ఉత్తర, దక్షిణ కొరియా సమస్యలు మళ్లీ మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాల యుద్ధం తర్వాత రెండు దేశాల అధ్యక్షులూ ఈమధ్యనే కలుసుకున్న విషయం తెలిసిందే! ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా తెగ మురిసిపోయారు. తానే స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలుసుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇంతలో ఏమొచ్చిందో కానీ క్రమంగా మాటల యుద్ధం మొదలైంది. అమెరికా, ఉత్తర కొరియా అధికారులు నువ్వెంతంటే నువ్వెంత అని కవ్వించుకోవడం మొదలుపెట్టారు. దాంతో ట్రంప్, కిమ్‌ల సమావేశం రద్దయింది. ఇప్పుడు మళ్లీ ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పరోక్ష యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.