TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి షాక్...కాంగ్రెస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్

Published on: Wed Oct 29, 2025 9:21PM

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. వెంగళరావునగర్ మాజీ కార్పొరేటర్,బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్,  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో  చేరారు. బీజేపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇటీవల షేక్‌పేట్ నుంచి పోటీ చేసిన మాజీ కార్పొరేటర్ చర్కా మహేష్ బీజేపీకి రాజీనామా చేసిన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కమలం పార్టీకి ఒకరి తర్వాత ఒకరు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రజాపాలన విధానాలు తనను నచ్చయని కిలారి మనోహర్ అన్నారు. గతంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై దాడులు జరిగిన సందర్భంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తనకు అండగా నిలిచారని, ఈ ఎన్నికల సమయంలో వారికి కృతజ్ఞతగా కాంగ్రెస్‌లో చేరుతున్నానని కిలారి మనోహర్ పేర్కొన్నారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కిలారి మనోహర్ కాంగ్రెస్‌‌లో చేరటం హస్తం పార్టీకి మరింత బలం చేకురుతుంది. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు గణనీయంగా ఉండటంతో కాంగ్రెస్‌‌కు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు.