TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నటి ఖుష్బూ

Published on: Wed Jul 30, 2025 9:13PM

 

ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు  ఖుష్బూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖుష్బూ సుందర్ సహా 14 మంది నియమితులయ్యారు. 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, రాష్ట్ర కార్యదర్శులుగా మరో 14 మందితో కూడిన జాబితాను నాగేంద్రన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, ఆమె పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2010లో డీఎంకేతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది. 2020లో బీజేపీలో చేరారు.