TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో ఖర్గే, థరూర్

Published on: Fri Sep 30, 2022 3:23PM

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ అనివార్యమని తేలిపోయింది. ఆ పదవి కోసం పోటీ పడుతున్న నేతలెవరో కూడా తేలిపోయింది. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నాడు ఇరువురు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 30) ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశాయి. పార్టీ అధికారిక అభ్యర్థిగా మల్లికార్జన్ ఖర్గే నామినేషన్ దాఖలు చేయగా, ముందునుంచీ పోటీలో ఉంటానని చెబుతూ వస్తున్న శశిథరూర్ కూడా తన నామానేషన్ ను దాఖలు చేశారు. వీరిరువురూ వేరువేరుగా తమ తమ నామినేషన్ పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. శశిథరూర్ పెద్ద సంఖ్యలో అభిమానులతో డప్పు వాయిద్యాల మధ్య పార్టీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ అధ్యక్ష ఎన్నిక అంతా పారదర్శకంగా ఫ్లా లెస్ గా జరుగుతోందని తాను భావించడం లేదన్నారు. అయితే మ్యాచ్ లోకి దిగిన తరువాత అక్కడ ఉన్న పిచ్ పైనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.

కాగా తాను పోటీ నుంచి విరమించుకునే ప్రశ్న, ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి విరమించుకుంటే తన క్యాడర్ ను నిరాశపరిచిన వాడినౌతానని అన్నారు. స్వేచ్ఛగా, సజావుగా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాగా అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన శశిథరూర్ పార్టీ నేతలలో అసమ్మతి వాదులుగా పేరుబడ్డ  జీ 23 నేతల్లో ఒకరు. పార్టీని ప్రక్షాళన చేయాలని  కోరుతూ సోనియాగాంధీని కోరిన  గులాంనబీ  ఆజాద్ , కపిల్ సిబల్, ఆనందశర్మ తదితరులలో శశిథరూర్ కూడా ఒకరు.

ఇప్పటికే జీ23 నేతల్లో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ పార్టీని వీడి వెళ్లి పోయారు. పార్టీలోనే కొనసాగుతున్న శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీలో దిగారు.  ఇక కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గేకు మద్దతుగా దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 30) మళ్లికార్జున్ ఖర్గేతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఆ తరువాత తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.

పార్టీ అధ్యక్ష ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఉదయం నుంచీ నాటకీయ పరిణామాలు సంభవించాయి. పార్టీ అధినేత్రి అశోక్ గెహ్లాట్ ను పార్టీ ముందుగా సోనియా గాంధీ అధ్యక్ష అభ్యర్థికి పోటీగా ప్రతిపాదించారు. ఆయన అందుకు సంభవించినా అనంతరం రాజస్థాన్ లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అనివార్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత పార్టీ పలువురి పేర్లు పరిశీలించింది.

తొలుత కాంగ్రెస్ అధినేత్రి పరిశీలించిన పేర్లలో మల్లికార్జున్ ఖర్గే పేరు లేదు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ల పేర్లు పరిశీలించి దిగ్విజయ్ పేరును ఖరారు చేశారు. అయితే చివరి క్షణంలో దిగ్విజయ్ పోటీ నుంచి తప్పుకుని ఖర్గే తెరపైకి వచ్చారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరొందిన ఖర్గే మంచి వక్త, రాజ్యసభలో కాంగ్రెస్ గొంతు బలంగా వినిపిస్తారు.  

h