ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..తెలంగాణవాదులు అరెస్ట్
Published on: Wed Apr 11, 2012 11:06AM
కొత్త
గూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి మైనింగ్ గ్రాడ్యుయేట్ పరీక్షను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీలో తెలంగాణవారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దాంతో పరీక్షను అడ్డుకున్న 12 మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్ట్ చేసి జూలూరుపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.


