ప్రభుత్వ విధులు గాలికి.. వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం!

 

 

ఎవరైనా ఖాళీ సమయంలో తమకు తోచిన, నచ్చిన హాబీలతో రిలాక్స్ అవటం మనం చూస్తూనే ఉంటాం. కానీ అక్కడ మాత్రం ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులు చేయాల్సిన పని పక్కన పెట్టేసి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కలం గడిపేస్తున్నారు. సమస్యలతో అక్కడికి వచ్చే ప్రజలను పట్టించుకోకుండా టైం పస చేస్తున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు విధులను గాలికి వదిలేసి టిక్‌టాక్‌ వీడియోలు షూట్ చేస్తూ కలం గడిపేస్తున్నారు. నలుగురైదుగురు ఓకే చోటీయ చేరి వీడియోలు షూట్  చేసి టిక్ టిక్‌టాక్‌ లో  పోస్ట్ చేసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం వీరు పోస్ట్ చేసిన వీడియోలు వైరాలు గా మారాయి. దీనిని కొందరు ఎంజాయ్ చేస్తుండగా మరి కొందరు వీటి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో సమస్యల తో సహాయం కోసం వచ్చే ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు.. ఇలా ఆఫీసు టైమ్ లో  టిక్‌టాక్‌ వీడియోల షూటింగ్ లో మునిగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చూద్దాం దీని పై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో..