TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ!

Published on: Sat Sep 6, 2025 10:02AM

గణేష్ చతుర్థి నుంచి భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం ప్రారంభమైంది. 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నవిశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని  గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు ఎస్టీసీ ట్రాన్స్ పోర్టుకు చెందిన26 టైర్ల  ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.   100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగిస్తున్నారు. శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటల సమయానికి ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.   

ఖైరతాబాద్ నుంచి ఆరంభమైన న ఈ శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయానికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు.