TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మల బడ్జెట్ లో ముఖ్యమైన పది పాయింట్లు

Published on: Tue Feb 1, 2022 1:34PM

నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కీలకమైన అంశాలు ఓ పది ఉన్నట్టుగా  ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవేంటంటే...

1) ట్యాక్స్ సిస్టమ్ ను మరికాస్త సరళీకరించినట్లు నిర్మల చెప్పారు. ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశాక దాన్ని అప్ డేట్ చేసుకునేందుకు మరో రెండేళ్ల సమయాన్ని కూడా ఇవ్వడం విశేషం. దీంతో రిటర్న్స్ దాఖలు చేశాక సవరణలు చేసుకునేందుకు, ఖర్చులు, మదుపులు మొదలగువాటిని మరోసారి బేరీజు వేసుకొని ఫైనల్ కాపీ సమర్పించుకునే అవకాశాన్ని పొందారన్నమాట. 

2) సహకార సంస్థలకు ఆల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్ ను ఇప్పుడున్న 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఏడాది మొత్తం ఆదాయానికి  పడే పన్ను ఆల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్ (ఏఎంటీ) కన్నా తక్కువ ఉన్నప్పుడు సంబంధిత సంస్థలు గానీ, వ్యక్తులు గానీ ఏఎంటీ  చెల్లించాల్సి ఉంటుంది. అదిప్పుడు 3.5 శాతానికి తగ్గడంతో అర్హులైన సంస్థలకు కాస్త ఊరట లభించినట్లయింది.

3) రూ. కోటి ఆదాయం లోపు ఉన్న కోపరేటివ్ సంస్థలపై సర్ చార్జ్ ని ఇప్పుడున్న 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించారు.

4) మహమ్మారి దెబ్బతో విలవిల్లాడుతున్న స్టార్టప్ కంపెనీలకు మరికాస్త ఊరటనిచ్చారు. మూడేళ్లుగా వాటికి కల్పిస్తున్న పన్నుల వెసులుబాట్లను మరో ఏడాదిపాటు పొడిగించారు. 

5) వర్చువల్ డిజిటల్ ఆస్తులపై (క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వగైరా) 30 శాతం ట్యాక్స్ విధించారు. అలాగే ఆ కరెన్సీ ట్రాన్స్ ఫర్ చేస్తే దానికి 1 శాతం టీడీఎస్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

6) మోడీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ వసూళ్లు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ పన్నుల వసూళ్ల ద్వారా జీడీపీ గణనీయంగా పెరిగింది. ఒక్క జనవరి మాసానికే జీఎస్టీ వసూళ్లు లక్షా 40 వేల కోట్లుగా ఉన్నాయని నిర్మల చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఇదే హైయ్యెస్ట్ కావడాని నిర్మల విశేషంగా చెప్పుకున్నారు. 

7) జీఎస్టీ వసూళ్లు అద్భుతంగా ఉండడానికి ట్యాక్స్ పేయర్సే ముఖ్య కారణంగా కితాబిస్తూ నిర్మల వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

8) దేశవ్యాప్తంగా వస్తువుల ఎగుమతులకు వచ్చే మూడేళ్లలో 100 కార్గో టర్మినల్స్ నిర్మిస్తామని చెప్పారు. 

9) స్పెషల్ ఎకానమిక్ జోన్స్ (ఎస్.ఇ.జడ్) చట్టాన్ని సవరిస్తామంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మీద అది చూపించే ప్రభావాన్ని మదింపు వేశాక ఎస్.ఇ.జడ్ చట్టాన్ని సవరిస్తామంటున్నారు. త్వరలో జరిగే ఈ మార్పులతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకునే అవకాశాలున్నాయి.

10) అర్హులైన పేదలందరికీ పక్కా గృహాల కోసం కేంద్రం ప్రయారిటీ ఇస్తోంది. ఈ రంగం ద్వారా నిర్మాణ రంగం బాగా పుంజుంకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.