TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టు కీలక నేత బర్సే దేవా లొంగుబాటు

Published on: Fri Jan 2, 2026 2:20PM

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.   మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పని చేస్తున్న బర్సే దేవా  పోలీసుల ఎదుట లొంగిపోయారు. బర్సే దేవా తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం (జనవరి 2) లొంగిపోయాడు. మావోయిస్టు అగ్రనేత హెడ్మా  ఎన్ కౌంటర్  తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో  మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

ఎందుకంటే  హైడ్మా,  బర్సే దేవా  ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలోని  ఒకే గ్రామానికి చెందినవారు. ఇరువురూ కూడా దాదాపు ఒకే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరారు. ఇరువురూ కూడా పార్టీకి ఆయుధాల సరఫరా, ఆయుధాల వ్యవహారం, గెరిల్లా పోరాట పంథాలో ఆరితేరిన వారే.  కాగా లొంగిపోయిన బార్స దేవా తన వద్ద ఉన్న మౌంటెన్ ఎల్ఎంజి ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు.  దేవాతో పాటు  మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.  ఇలా ఉండగా బర్స దేవాను శనివారం (జనవరి 3) మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.