Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిర్మలమ్మ పద్దులో ముఖ్యాంశాలు
posted on: Feb 1, 2025 10:53AM
.webp)
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో అన్నివర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, రాష్ట్రాలకు రుణాలు, దేశ వ్యప్తాంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు వంటి కీలక అంశాలను ఆమె ప్రకటించారు.
- పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో కొత్త యూపిఐ లింక్ డ్ క్రెడిట్ కార్డులు
- క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
-పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నేషనల్ మేనిఫ్యాక్చరింగ్ మిషన్
- విమనయానాన్ని ప్రోత్సహించేందుకు కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు వచ్చే పదేళ్ల కాలంలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ కల్పన లక్ష్యం
- రాష్ట్రాలకు రూ.1.5లక్షల కోట్ల రుణాలు. ఐదు దశాబ్దాలకు వడ్డీ రహిత రుణాలు.. సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు
-గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన దీని వల్ల కోటి మవదవి గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
- బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
-ఇక దేశంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోనికి తీసుకు రానున్నట్లు ప్రుకటించారు.
దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లు
జల్ జీవన్ మిషన్ కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచి నీరు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వందశాతం తాగునీటి కుళాయిలు .



.webp)


