కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా...జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు

posted on: Feb 16, 2026 7:03PM

 

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా.. ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు అని అన్నారు. జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 నియోజకవర్గాల్లో ఎలా పరిస్థితి ఉందో అని వాపోయారు. 

 మరోవైపు తన వర్గానికి ఛైర్మన్ పీఠం దక్కకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలన్నారు.. తన ప్రతిపాదనను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్‌ రెడ్డి కలత చెందారు. తన వర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణిని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేయడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...