అధికారులకు క్షమాపణ చెప్పిన నాని, ఉమ
Published on: Sun Mar 26, 2017 3:11PM

విజయవాడ ఆర్టీఏ కార్యాలయం వద్ద నిన్న చోటు చేసుకున్న ఘటనపై అధికారులకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా చూసుకుంటామని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై మీడియాలో కథనాలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..వెంటనే ఎంపీ, ఎమ్మెల్యేలను తన దగ్గరకు పిలిపించుకున్న సీఎం వారికి క్లాస్ పీకారు. ప్రభుత్వంలో ఉన్నందున నేతలు జాగ్రత్తగా ఉండాలని..అనవసర వివాదాలు తెచ్చుకోవద్దని సూచించారు. దీంతో ఇద్దరు నేతలు వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారు. నిన్న చోటు చేసుకున్న ఘటన పట్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని..ఉద్యోగులతో తమకు ఎలాంటి వైరం లేదని వారు స్పష్టం చేశారు.


