నోటి దూల.. ఉద్యోగం పోయిందని విలవిల

భారీ వరదలతో కేరళ అల్లకల్లోలం అయిపోయింది.. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు కేరళను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.. కేరళను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని, కాపాడాలంటూ దేవుడిని వేడుకుంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు.. అయితే ఓ వ్యక్తి కేరళ వరదల గురించి వివాదాస్పద పోస్ట్ పెట్టి ఉద్యోగమే పోగొట్టుకున్నాడు.. కేరళకు చెందిన రాహుల్‌ చెరు పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.. తన నోటిదూలతో ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

 

 

ఇంతకీ విషయం ఏంటంటే.. కేరళలో ‘శానిటరీ నాప్‌కీన్లు’ కూడా అందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్‌ పోస్టు చేశారు.. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్‌ ‘కండోమ్‌లు కూడా అవసరమే’ అంటూ అసభ్యంగా పోస్టు చేశాడు.. ఈ పోస్టుపై లులు గ్రూప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ‘రాహుల్‌ సోషల్‌మీడియాలో చేసిన అసభ్య కామెంట్ల నేపథ్యంలో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. దీంతో స్పందించిన రాహుల్‌, ఫేస్‌బుక్‌ ద్వారా క్షమాపణలు తెలిపాడు.. ‘ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నాను.. ఏం మాట్లాడుతున్నానో చూసుకోలేదు.. జరిగిందానికి నిజంగా క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని వీడియో ద్వారా తెలిపాడు.. అయితే రాహుల్‌ క్షమాపణలను కంపెనీ అంగీకరించలేదు.. ‘ఇలాంటి ఘటనలను మేం సమర్థించబోం.. మా సంస్థ మానవ సంబంధాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది.. రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ చీఫ్‌ కమ్యూనికేషన్ ఆఫీసర్ స్పష్టం చేశారు.. అందుకే అంటారు నోరు అదుపులో పెట్టుకోవాలని.. నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే ఇలాగే ఉంటుంది.