TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దారుణం.. బాలికపై మహిళే లైంగిక వేధింపులు...

Published on: Sat Mar 18, 2017 4:07PM

 

సాధారణంగా మహిళలను, పురుషులు లైంగికంగా వేధించడం చూస్తుంటాం. కానీ కేరళలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి తన వికృతబుద్ధిని చాటింది. వివరాల ప్రకారం...కేరళలో ఓ మైనర్ బాలిక దుస్తులు మార్చుకుంటుండగా ఓ మహిళ .. ఆమెను అశ్లీలంగా ఫొటోలు తీసింది. అంతేకాదు అక్కడితో ఆగకుండా ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి బహిరంగ పరుస్తానని బెదిరించి.. అప్పటినుంచి బాలికతో లైంగికంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఈవిషయం ఎవరితోనైనా చెప్పడానికి భయపడ్డ బాలిక ఆఖరికి  తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుస నిందితురాలని అరెస్టు చేశారు. బాలిక అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసిన ఫోన్‌తోపాటు సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు ఆమెకు పోలీసు కస్టడీ విధించింది.