TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..

Published on: Fri Mar 10, 2017 4:36PM

 

కేరళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్‌ రాజీనామా చేయడమే కారణం అంటున్నారు. అనారోగ్యం వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధీరన్‌ వెల్లడించారు. కేపీసీసీ చీఫ్‌గా బాధ్యతల కారణంగా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవడం కుదరడంలేదని, కానీ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విశ్రాంతి అవసరమని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని సుధీరన్‌ తెలిపారు. కాగా కోజికోడ్ తో గతవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.