కరోనా రోగుల ట్రీట్మెంట్ కోసం ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్

* కేరళ ప్రభుత్వానికి ఐ.సి.ఎం.ఆర్ అనుమతి 

కోవిడ్ -19 వ్యాధికి సంబంధించి సౌత్ కొరియా అవలంబించిన ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్  విధానాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయదలచింది. ఇందుకు అవసరమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐ సి ఎం ఆర్ ఆమోదం కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది.  బ్లడ్ లోని ద్రవపదార్థ మైన ఈ ప్లాస్మా ను, వ్యాధి బారిన పడి దాని నుంచి బయటపడిన రోగుల నుంచి సేకరిస్తారు, అటువంటి రోగుల ప్లాస్మాలో ఈ వ్యాధికి సంబంధించిన యాంటీ బాడీస్ ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల,  ఈ వ్యాధిని అరికట్టేందుకు సహకరిస్తుంది సౌత్ కొరియా లో ఈ పద్ధతి ద్వారా వారు క్రిటికల్ కేసెస్ లో వైద్యాన్ని అందించే ఆ రోగులను కాపాడగలిగారు ఇదే పద్ధతిని ఇప్పుడు కేరళ ప్రభుత్వం అవలంబించేందుకు కావలసిన అనుమతులను ఐ సి ఎం ఆర్ ఇవ్వడం జరిగింది.

మల్టీ సెంటర్ ట్రయల్స్ కు ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నది. ఒక రికవర్ ఆయన రోగి నుంచి సుమారుగా 800 ఎం.ఎల్ ప్లాస్మాను తీసుకునే అవకాశం ఉంటుంది , ఒక్కొక్క రోగికి 200 ఎం.ఎల్ ప్లాస్మా ట్రీట్ మెంట్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది.  ఈ పద్ధతిలో ఫలితాలు సాధించినట్లు అయితే చాలా వరకు COVID-19 వలన సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని విజయవాడ కు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ సూచించారు.