TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళలో అనుకోని అతిథులు

Published on: Wed Aug 22, 2018 12:44PM

 

కేరళలో వరదలు అపార నష్టాన్ని కలిగించాయి. ప్రకృతి ప్రకోపంతో కేరళ తల్లడిల్లుతోంది. భారీ వరదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లులు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాలను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 350 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 3.5 లక్షల మంది ఇళ్లు వాకిలి వదిలిపెట్టి పభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిభిరాల్లో  తలదాచుకుంటున్నారు. కాగా కేరళలో క్రమంగా వరదనీరు తగ్గుతూ వస్తుండటంతో అక్కడి ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్లలోకి అడుగుపెట్టిన వీరికి అనుకోని అతిథులు దర్శనమిస్తున్నారు. భారీగా కురిసిన వర్షాలకు పాములు, మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. ఇప్పటివరకు ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ ప్రజలు ఇప్పుడు ఈ ప్రాణాంతకమైన జంతువులు ఎక్కడ దాగిఉన్నాయో అని భయపడుతున్నారు.